ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ లో మళ్లీ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో క్రైం రేట్ చాలా తగ్గిందని పోలీసులు లెక్కలు చెప్తున్నానేరాలు మళ్లి పెరిగిపోతున్నట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. దొంగతనాలు, అఘాయిత్యాలు, హత్యలు, కిడ్నాప్ లతో భాగ్యనగరాన్ని హడలెత్తిస్తున్నారు నేరగాళ్లు . ఇటీవల ఈ క్రైం రేటు మరింత పెరిగింది. నగరంలో ఇలాంటి ముఠాలు అటు పోలీసులకు, ఇటు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
Hyderabad: ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ లో మళ్లీ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో క్రైం రేట్ చాలా తగ్గిందని పోలీసులు లెక్కలు చెప్తున్నానేరాలు మళ్లి పెరిగిపోతున్నట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. దొంగతనాలు, అఘాయిత్యాలు, హత్యలు, కిడ్నాప్ లతో భాగ్యనగరాన్ని హడలెత్తిస్తున్నారు నేరగాళ్లు . ఇటీవల ఈ క్రైం రేటు మరింత పెరిగింది. నగరంలో ఇలాంటి ముఠాలు అటు పోలీసులకు, ఇటు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా మహిళల భద్రతకు భరోసా లేకుండా పోయిందనే విషయాన్ని మనం స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు ప్రతి ఏటా ఎన్సీఆర్బీ నివేదికలను విడుదల చేస్తూ, నేరాల సంఖ్య పెరగడానికి గల కారణాలను కూడా చెబుతుంది. మహిళలకు సంబంధించే కాక హత్యలు, ఆత్మహత్యలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, వేధింపులు, బాలలపై నేరాలు వంటి అంశాలకు సంబంధించి కూడా గణాంకాలను సేకరించి, క్రోడీకరించి ఎన్సీఆర్బీ నివేదికలు రూపొందిస్తుంది. హైదరాబాద్ లో నానాటికి కెరిమె రేట్ పెరుగుతుందని కొన్ని నివేదికలు చెపుతున్నాయి.
ముఖ్యంగా స్త్రీలపై నేరాలు మరింతగా పెరిగాయి. 2020 నివేదిక ప్రకారం 17,791 నేరాలు జరగగా, 2021లో 20,865 కు పెరిగాయని నివేదిక ద్వారా తెలుస్తోంది. కాగా ఇందులో 9,468 నేరాలకు వారి భర్తలు లేదా బంధువులే కారణమని, అత్యాచార సంఘటనలో 95.5% తెలిసిన వారేననే దిగ్భ్రాంతిని కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో జరిగే మొత్తం నేరాల్లో అధిక సంఖ్య నేరాలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే నమోదు అవుతున్నాయి. ఈఏడాది ఇప్పటికే హైదరాబాద్ లో అనేక నేరాలు నమోదయ్యాయి. వాటిని కంట్రోల్ చేస్తున్నామని పోలీసులు తెలుపుతున్న నగరంలో ఎదో ఒక మూలాన ఈ నేరాలు పెరిగి పోతున్నాయి. ప్రేమించానని వెంటబడి, పెళ్లిళ్ల దగ్గరికి వచ్చేసరికి యువతులను వదిలించుకోవడానికి మర్డర్ లు కూడా చేస్తున్నారు. జీవితాంతం తోడు ఉండాలని ఏడడుగులు కలిసి నడిచిన భార్యలపై అనుమానం పెంచుకుని దారుణంగా హత్యలు చేస్తున్నారు. మరికొందరు వివాహేతర సంబంధం వంటి వాటికి అడ్డు వస్తున్నారని పసిపిల్లలను దారుణంగా హత్య చేస్తున్నారు.
నగరంలో నేరప్రవృత్తి పెరిగిపోతుంది. రోజురోజుకు ఉన్మాదుల ఘాతుకాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంత నగరంగా పేరొందిన హైదరాబాద్ వాసులు ఇప్పుడు భీతిల్లుతున్నారు. హత్యలు, ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెబుతున్న పోలీసు ఉన్నతాధికారుల మాటలు వట్టివేనని ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. శివారు ప్రాంతాలు, నగర నడిబొడ్డు అన్న భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ అఘాయిత్యాలు జరిగిపోతూనే ఉన్నాయి. గడచిన ఆరు నెలల కాలంలోనే క్రైం రేట్ ఎక్కువఅయింది అంటే శాంతి భద్రతల పరిస్థితికి దర్పణం పడుతోంది. నగరంలో తమ ప్రత్యర్థులను హతమార్చడం ఎంతో సునాయాసమైపోయింది. ఒకప్పుడు ఎక్కడైనా ఒక హత్య జరిగితే విశేషంగా చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు అదే పనిగా హత్యలు జరగడం సర్వసాధారణంగా మారిపోయింది. హైదరాబాద్ నేరాలకు అడ్డాగా మారుతుంది.
చాక్లెట్ తిన్నంత ఈజీగా హత్యలు చేస్తున్నారు. చుట్టూ ఎంత మంది వున్నా భయమన్నది లేకుండా యథేచ్ఛగా నడిరోడ్ల మీద కత్తులతో చెలరేగిపోతున్నారు. ఈ దారుణాలు చూస్తున్న జనాలు భీతిల్లుపోతున్నారు. కూర్చుని పరిష్కరించుకునే చిన్న చిన్న కారణాలతో పగలు పెంచుకుని దారుణాలకు పాల్పడుతున్నారు. కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు. పోలీసులు చూస్తుండగానే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. అన్నను కొట్టాడని, చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, బండికి దారి ఇవ్వలేదని.. తీసుకున్న అప్పు తీర్చడంలేదని ఇలాంటి చిన్న చిన్న వాటికీ హత్యలదాకా వెళుతున్నారు. ఇప్పుడు చదువుకునే విద్యార్థులుకూడా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమో అని భయంతో తన స్నేహితుడిని దారుణంగా హత్యచేసిన ఘటన హైదరాబాద్ లో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. వీటితో పాటు ఆర్థిక నేరాలు, భూ కబ్జాలు, కూడా హైదరాబాద్ లో అడ్డగా మారుతున్నాయి. ఇటీవల నగరంలో రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారు. గతంలో పోలీసుల నిఘా, చిన్నపాటి వివాదం జోలికి వెళ్లినా కఠినమైన సెక్షన్లతో కేసులు పెట్టి పీడీయాక్ట్, నగర బహిష్కరణ, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద జైలుకి పంపేస్తారనే భయం వుండేది. కొంతకాలంగా పోలీసు నిఘా తగ్గింది. దీంతో రెచ్చిపోతున్నారు. ఆటోలు, బైక్‌లపై కత్తులు, రాడ్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఎవరైనా ఎదురుచెప్పినా, ప్రశ్నించినా విచక్షణరహితంగా దాడులకు దిగుతున్నారు.