ఇటీవలే క్యూబాలో జరిగిన అంతర్జాతీయ కమ్యునిస్టు, కార్మికుల సదస్సులో పాల్గొనేందుకు క్యూబా వెళ్లిన సీపీఐ నారాయణకు మియామి ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. క్యూబాలో అంతర్జాతీయ సదస్సుకు హాజరై అక్కడి నుంచి పెరూకు బయలుదేరి వెళ్తుండగా మధ్యలో మియామి ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ఆయన్ను నిర్భంధంలోకి తీసుకున్నారు. సుమారు మూడు గంటలకు పైగా ఆయన్ను విచారించారు. కమ్యునిస్ట్ సమావేశాలకు హాజరైన నారాయణ క్యూబా అధ్యక్షుడితో ఫొటో దిగాడు.
CPI Narayana: ఇటీవలే క్యూబాలో జరిగిన అంతర్జాతీయ కమ్యునిస్టు, కార్మికుల సదస్సులో పాల్గొనేందుకు క్యూబా వెళ్లిన సీపీఐ నారాయణకు మియామి ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. క్యూబాలో అంతర్జాతీయ సదస్సుకు హాజరై అక్కడి నుంచి పెరూకు బయలుదేరి వెళ్తుండగా మధ్యలో మియామి ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ఆయన్ను నిర్భంధంలోకి తీసుకున్నారు. సుమారు మూడు గంటలకు పైగా ఆయన్ను విచారించారు. కమ్యునిస్ట్ సమావేశాలకు హాజరైన నారాయణ క్యూబా అధ్యక్షుడితో ఫొటో దిగాడు. ఆ ఫోటోను చూసిన మియామి ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను నిర్భంధించారు.
పెరూలో ఉన్న తన మనవడిని చూసేందుకు క్యూబా నుంచి బయలుదేరి వెళ్తుండగా ఆ ఘటన జరిగింది. సుమారు 3 గంటలకు పైగా వివిధ ప్రశ్నలతో నారాయణను మియామి ఇమిగ్రేషన్ అధికారులు వేధించారు. ఈ విచారణ కారణంగా పెరూ వెళ్లాల్సిన విమానం మిస్సైంది. మూడు గంటల విచారణ తరువాత ఆయన పెరూ వెళ్లేందుకు ఇమిగ్రేషన్ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో మరో విమానంలో ఆయన పెరూకు బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది.