కమ్యూనిస్టు నాయకులు జోరు పెంచారు. బీజేపీ చేస్తున్న పలు తప్పులను ఎండగడుతున్నారు. నేతలను నిలదీస్తున్నారు. చేసిన తప్పులను ఎత్తిచూపుతున్నారు. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా సీపీఐ నేత నారాయణ తెలంగాణ గవర్నర్ తీరుపై మండిపడ్డారు. గవర్నర్ తమిళసై రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారని విమర్శించారు.

గవర్నర్ తమిళసై RSS రాజ్యాంగం చదివిందని, మేం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చదివామని నారాయణ అన్నారు. దర్బారు పెట్టే హక్కు మీకెక్కడిది అని గవర్నర్ను నారాయణ ప్రశ్నించారు. నువ్వు బీజేపీ కార్యకర్తవని, తమిళనాడులో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయావని నారాయణ గుర్తుచేశారు.
మరోవైపు బిగ్బాస్ షో పై కూడా నారాయణ స్పందించారు. నాగార్జునకు నోటీసులు ఇచ్చిన ఏపీ హైకోర్టుకు అభినందనలు తెలిపారు. ఇలాంటి చీడ పరుగు లాంటి షోలు వెంటనే రద్దు చేయాలని మరోసాకి డిమాండ్ చేశారు. నాగార్జున ఇకనైనా ఆ షో నుంచి విరమించుకోవాలని నారాయణ కోరారు.