35 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగర పోలీస్ పునర్ వ్యవస్థీకరణ జరిగిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీవీ ఆనంద్ మాట్లాడుతూ... హైదరాబాద్ జనాభా రోజు రోజుకు విపరీతంగా పెరిగి పోతుందని అన్నారు.
Hyd CP CV Anand: 35 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగర పోలీస్ పునర్ వ్యవస్థీకరణ జరిగిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీవీ ఆనంద్ మాట్లాడుతూ… హైదరాబాద్ జనాభా రోజు రోజుకు విపరీతంగా పెరిగి పోతుందని అన్నారు. దీంతో పోలీస్స్టేషన్ల పెంపుదల, జోన్ల రూపుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని తెలిపారు. 6 నెలల పాటు రీ ఆర్గనైజేషన్ కమిటీ కూర్చుని కొత్త పోలీస్స్టేషన్లకు ప్రతిపాదన చేశామని అన్నారు. 35 ఏళ్ల కింద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 లక్షల మంది జనాభా ఉండేవారని… ఇప్పుడు 85 లక్షలకు పెరిగిందన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 కొత్త డీసీపీ జోన్లు, 11 ఏసీపీ డివిజన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లు, 5 కొత్త ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు.
సెక్రటేరియట్ కోసం కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే అబిడ్స్ పోలీస్ స్టేషన్ గా హైదరాబాద్ కలెక్టరేట్ బిల్డింగ్, ఫిలిం నగర్ లో ఆపరేటివ్ సొసైటీ ప్రేమిసేస్ లో ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్, మధుర నగర్ పోలీస్ స్టేషన్ గా రెహ్మత్ నగర్ ఒపి బిల్డింగ్ ,సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ లో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్, హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ లో మసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్, బొరబొండ ఔట్ పోస్ట్ పోలీస్ వద్ద బోరబండ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి జోన్ కు ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ కోసం 148 మంది, భద్రత కోసం 30 మంది సోషల్ మీడియా , ఐటి సెల్ కోసం 243 మంది, డ్రగ్స్ విభాగం హెచ్ న్యూ కోసం 34 మంది,7 టాస్క్ ఫోర్స్ జోన్ లో 209 మంది, షి టీమ్స్ కోసం 77 మంది సిబ్బంది ఏర్పాటుచేశామని తెలిపారు. జూన్ 2 నుంచి కొత్త పోలీస్ స్టేషన్స్‌లో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామన్నారు. 35% సివిల్ కానిస్టేబుల్స్, 120 ఎస్ఐ పోస్టులు వేకెన్సీ ఉన్నాయని ఈ సందర్బంగా తెలిపారు.