Formula-e-race: ఫార్ములా-ఈ రేసింగ్‌కు ఏర్పాట్లకు సిద్దమవుతున్న నగరం
Formula-e-race: ప్రపంచంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్ననగరాల్లో హైదరాబాద్ ఒకటి. పిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేస్ ఈ కార్యక్రమం 100 రోజుల కౌంట్‌డౌన్‌ను దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఆమధ్య లాంఛనంగా ప్రారంభించారు. ఇంకో ఇరవై రోజుల్లో ఫార్ములా-ఈ రేసింగ్ హుస్సేన్ సాగర్ చుట్టూ రయ్ రయ్ అంటూ చక్కర్లు కొట్టనుంది. ఇందుకోసం అధికారులు త్వరితగతిన పనులు చేస్తున్నారు. ఇప్పటికే రెయిలింగ్ పనులు పూర్తిచేసారు. అలాగే రోడ్డు నిర్మాణ పనులు చక చక పూర్తిచేస్తునారు.
ఇప్పటికే గతేడాది రెండు సార్లు ట్రయల్ రన్ నిర్వహించారు. అందులో నిర్వహణలోపం కళ్లకు కట్టినట్టు కనిపించింది. రెండవ సారి ట్రయల్ రన్ లో ట్రాక్ నిర్వహణ లోపం కనిపించింది. మధ్యలోనే పోటీలను నిలిపేశారు. మరి ఇప్పుడు వచ్చే నెల్లో జరుగబోయే కార్ రేసింగ్ కి ట్రాక్ నిర్మాణం పూర్తయింది. హుసేన్‌సాగర్ వేదికగా ఫిబ్రవరి 11న జరుగనున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది.
నిర్వాహకులు ఇప్పటికే టికెట్స్ ను అందుబాటులోకి తెచ్చారు. రూ.1000 నుంచి రూ.10,000 వేల వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.1,000 గ్రాండ్ స్టాండ్, రూ.3,500కు ఛార్జ్ గ్రాండ్ స్టాండ్, రూ.6,000కు ప్రీమియం గ్రాండ్ స్టాండ్, రూ.10వేలకు ఏస్ గ్రాండ్ స్టాండ్ టికెట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ఈ ఫార్ములా ఈ-రేసింగ్ ప్రారంభం కానుంది.