హైదరాబాద్ బంజారాహిల్స్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యాలయంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేపట్టడంపై వివాదం చెలరేగుతోంది.
Congress War Room Case: హైదరాబాద్ బంజారాహిల్స్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యాలయంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేపట్టడంపై వివాదం చెలరేగుతోంది. తనపై ట్రోలింగ్ చేస్తున్నారంటూ సొంత పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతోనే యూత్ కాంగ్రెస్ వార్ రూమ్‌లో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు బయటపడింది. ఈ కేసులో ప్రశాంత్ నేడు ఉదయం 11 గంటలకు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురు ఉద్యోగులకు పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. నిన్న పోలీసుల ఎదుట రాజేష్, రాజు, అజయ్ హాజరవ్వగా.. ఈరోజు ప్రశాంత్ పోలీసులముందట హాజరయ్యాడు.
ఈ సందర్బంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. ఇధి పూర్తిగా మా పార్టీ అంతర్గత వ్యవహారం ఉత్తమ్ కుమార్ రెడ్డి నంబర్ ఇప్పుడు మా దగ్గర లేదు అని అన్నారు.ఎక్కడో చిన్న మిస్ కమ్యూనికేషన్ జరిగింది..అంత మాత్రాన పోలీస్ లు మా సిస్టమ్స్ అన్ని ఎలా ఎత్తుకొచ్చేస్తారని అన్నారు. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ ఛార్జ్ ప్రశాంత్ పై వేటు వేసింది. దీనిపై స్పందిస్తూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డిగారు అంటే మా అందరికీ అభిమానం.. ఈ ట్రోల్స్ మేము కావాలని చేసింది కాదని అన్నారు. ఆఫీస్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారన్నారు. ఆ ఫోన్ నంబర్ చలమల కృష్ణారెడ్డి పేరు పై ఉందని.. కృష్ణా రెడ్డి మా క్లయింట్..అందుకే మేము అతనికి పని చేసామని చెప్పారు.