తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ బీజేపీ, టీఆర్‌ఎస్‌లను కలిపి టార్గెట్ చేశారు. ప్రధాని రామగుండం పర్యటనపైనా, కేసీఆర్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా మండిపడ్డారు. పలు ప్రశ్నలు సంధించారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ బీజేపీ, టీఆర్‌ఎస్‌లను కలిపి టార్గెట్ చేశారు. ప్రధాని రామగుండం పర్యటనపైనా, కేసీఆర్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా మండిపడ్డారు. పలు ప్రశ్నలు సంధించారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసేసిందే బీజేపీ అని గుర్తుచేశారు. 2013లో పది వేల కోట్ల రుణాలు మాఫీ చేసి.. ఫ్యాక్టరీ ఓపెన్ కావడానికి కాంగ్రెస్ కృషి చేసిందని మధు యాష్కీ తెలిపారు. తమ కృషి వల్లే రామగుండం ఫ్యాక్టరీ బాగుపడిననట్లు బీజేపీ ప్రచారం చేయడాన్ని మధుయాష్కీ తప్పుబట్టారు. మరోవైపు టీఆర్‌ఎస్ పార్టీ పైనా పలు విమర్శలు చేశారు.
ప్రధాని వచ్చినప్పుడే టీఆర్‌ఎస్ గొడవ చేస్తుందని, ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీ కాళ్ళ మీద పడి వస్తారని మధుయాష్కీ విమర్శించారు. ఇక్కడికి ప్రధాని వస్తుంటే నాటకాలు అడుతున్నారని, ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్‌ఎస్, బీజేపీల పంచాయతీ అని మధు యాష్కీ విమర్శించారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా మధు యాష్కీ ఘాటుగా స్పందించారు. ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిళసై తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మధుయాష్కీ విమర్శలు గుప్పించారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో దొంగలే దొంగ అన్నట్టు ఉన్నదని అన్నారు. గవర్నర్‌కి అనుమానం ఉంటే కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజమేనని, ప్రతిపక్ష నాయకుల ఫోన్లే టార్గెట్‌గా ట్యాపింగ్ జరుగుతోందని యాష్కీ ఆరోపించారు. అదే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణ జరిగినట్లుగానే తెలంగాణ లిక్కర్ పాలసీ పై సీబీఐ విచారణ జరగాలని మధు యాష్కీ కోరారు.