KVR Meets Revanth: కోమటిరెడ్డి స్నేహహస్తం… కలిసిపనిచేద్దామని పిలుపు
Komati Reddy Meet Revanth Reddy: చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం రోజున గాంధీ భవన్‌లో పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, పార్టీ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ థాక్రేను కలిశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా రేవంత్ రెడ్డితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డితో విడిగా గాంధీభవన్‌లో మాట్లాడిన ఆయన, హాత్ సే హాత్ జోడో లో కలసి నడుద్దామని పిలుపునిచ్చారు. పాత విషయాలను మర్చిపోయి పార్టీ బలోపేతానికి పిలుపునివ్వడంతో కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
ఇక, రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఎన్నికలు ఎప్పుడు ఏ క్షణంలో వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం నాగర్ కర్నూల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో పాల్గొంటానని కోమటి రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంపై ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ థాక్రే చర్చించనున్నారు. దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఈనెల 26వ తేదీ నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉన్నది. జూన్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనున్నది.