Telangana Congress: ఆడపడుచుల ఏడుపు …అరాచక పాలనకు ముగింపు
Congress lady leader Sunitha rao tweet targets KCR
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఆసక్తికర ట్వీట్ చేశారు. కీలక పదవుల్లో ఉన్న మహిళలు ఏడ్చిన సందర్భాలను గుర్తుచేశారు. సిరిసిల్ల మహిళా నేత, జగిత్యాల మున్సిపల్ చైర్మన్, వాజేడు ఎంపిపి, కొత్త గూడెం మున్సిపల్ చైర్మన్, కరీం నగర్ జెడ్పీ చైర్మన్, ఉప్పల్ కార్పోరేటర్ తదితరులు గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భోరున విలపించారు. ఆ సంఘటనలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఆ సంఘటనలను గుర్తుచేస్తూ సునీత రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆడపడుచుల ఏడుపు..అరాచక పాలనకు ముగింపు అని ట్వీట్ చేశారు.
ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవితను ఈడీ విచారణ చేయడాన్ని తెలంగాణ మహిళపై జరుగుతున్న దాడిగా గులాబీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో గతంలో మహిళా అధికారులు పడ్డ ఇబ్బందులను సునీతారావు గుర్తుచేశారు.
మహిళల కన్నీటి కారణం కావద్దు
మహిలు సమాజం కోసం చేస్తున్న సేవలను గుర్తించి ప్రశంసించకపోయినా పర్వాలేదుగానీ వారి కన్నీటికి కారణం కావద్దని సునీతరావు సీఎంకు సూచించారు. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు: తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది..భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ తన వంతుగా సమాజ సేవకు ముందుకు వస్తున్న అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకపోయిన పర్లేదు కానీ వారి కన్నీటి కారణం కావద్దు.
మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు: తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది..భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ తన వంతుగా సమాజ సేవకు ముందుకు వస్తున్న అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకపోయిన పర్లేదు కానీ వారి కన్నీటి కారణం కావద్దు pic.twitter.com/FBYXuTidVv
— Sunitha Rao Mogili (@SunithaRao_M) March 11, 2023