Command Control Center : ‘కమాండ్ కంట్రోల్’ కేంద్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్
Command Control Center will be Inaugurated on August 4th : హైదరాబాద్ మహా నగరంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ నిర్మాణం కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభానికి తాజాగా ముహూర్తం ఖరారు చేశారు. ఆగస్టు 4వ తేదీన ఈ భారీ భవనాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 585 కోట్ల భారీ బడ్జెట్ తో బంజారాహిల్స్ లో చేపట్టిన ఈ భారీ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో హైదరాబాదులోనే ఐకానిక్ భవనంగా ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అదనపు సీపీలు డిఎస్ చౌహన్, ఏఆర్ శ్రీనివాస్, సంయుక్త కమిషనర్లు ఏవి రంగనాథ్, డాక్టర్ గజరావు భూపాల్, బీసీ పూలు జోయల్ డేవిస్, సునీత రెడ్డి కలిసి శనివారం ప్రారంభోత్సవ సన్నాహాలు, పనుల తీరును పరిశీలించారు. ఈ భవనం 19 అంతస్తులు ఉండగా, సందర్శకులు మాత్రం 14 నుంచి 15 అంతస్తుల వరకు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అక్కడి వరకు వెళ్లి నగరాన్ని 300 డిగ్రీల కోణంలో వీక్షించే అవకాశం లభిస్తుంది. అయితే దీనికి టికెట్ తప్పనిసరి. ఇక ఆరో అంతస్తులో ఉన్న కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వచ్చి బయట నుంచి పోలీసులు చేసే ఆపరేషన్లు కూడా వీక్షించేందుకు పర్మిషన్లు ఇస్తున్నారు. జూలై 31 కల్లా అంతా సిద్ధం చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు.