New Collectorates in Telangana: ఈ నెలలో మరో మూడు కలెక్టరేట్లు ప్రారంభం
New Collectorates in Telangana: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే అనేక కొత్త సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ఇప్పటికే ప్రారంభించారు. కాగా, జనవరి నెలలో మరోమూడు కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. సంక్రాంతికి ముందు రెండు కార్యాలయాలు ప్రారంభం కానుండగా, సంక్రాంతి పర్వదినం తరువాత మరో కార్యాలయం ప్రారంభం కానున్నది. జనవరి 12వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఈ రెండు కార్యాలయాలు ఒకేరోజున ప్రారంభం కానున్నాయి.
కాగా, సంక్రాంతి పండుగ తరువాత జనవరి 18వ తేదీన ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 9 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించిన తరువాత కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్, ఎస్సీ కార్యాలయాలతో పాటు, జిల్లాకు సంబంధించిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మిస్తున్నారు. అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం కేసీఆర్ ఉద్దేశం. విడతల వారీగా కొత్త కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే వరంగల్, సిద్ధిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ నెల్లో మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా సమీకృత కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి.