CM KCR: 99 శాతం సిట్టింగులందరికి సీట్లు..సీఎం కేసీఆర్
CM KCR: తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ను మూడోసారి గెలిపించి హ్యాట్రిక్ కొట్టాలని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యూహచరన చేస్తున్నారు. అంతిమంగా తమ పార్టీకి ప్రభుత్వానికి కలిసి వచ్చే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ శాసనసభాపక్ష పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశంలో కేసీఆర్ ఎన్నో సంచలనాలను ప్రకటించారు. అనేక అంశాలపై మాట్లాడుతూ ఎన్నో సంచలన విషయాలను ప్రకటించారు.ఈ సందర్భంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంలో వాస్తవం లేదని కేసీఆర్ తేల్చేశారు.
99 శాతం సిట్టింగులందరికి తిరిగి సీట్లు వస్తాయని స్పష్టం చేశారు. తప్పులు చేసే వారికి మాత్రం టికెట్లు దక్కవని చెప్పారు. వారి పని తీరు మార్చుకుంటే వారికే టికెట్స్ లేకుంటే మాత్రం నో టికెట్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా బీఆర్‌ఎస్‌కే అనుకూల వాతావరణం నెలకొందన్నారు. దళితబంధు విషయంలో కొన్నిచోట్ల ఆరోపణలు వచ్చాయని అంటూనే ..ఆదిలాబాద్,వరంగల్ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు డబ్బులుతీసుకుని ఇస్తున్నారని నాదగ్గర సమాచారం ఉంది. ఇటువంటివి సహించను అని పేర్లు చెప్పకుండా వారికీ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు.
ఈసారి సిట్టింగులెవరినీ మార్చాలనే ఉద్దేశం నాకైతే లేదు. ఎవరైనా తప్పులు చేస్తే తప్ప అలాంటి పరిస్థితులు రానీయకుండా చూసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్. ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలనీ,ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యే లకు సీఎం కేసీఆర్ సూచించారు. అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని టైమ్ ఉంది కదా అని లైట్ తీసుకోవద్దన్నారు.