CM KCR on Manish Sisodia Arrest: మనీష్ సిసోడియా అరెస్ట్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు… దృష్టి మరల్చేందుకే
CM KCR on Manish Sisodia Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అదివారం రోజున ఆయన్ను విచారించిన సీబీఐ ఆరోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నది. మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడంతో ఆప్ రోడ్డెక్కింది. కేంద్రం ఈ కేసులో కావాలనే తమ నేతలను ఇబ్బందులు పెడుతోందని వాదించింది. కాగా, మనీష్ సిసోడియా అరెస్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. మోడీ అదానీ అనుబంధం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు తప్పించి మరొకటి కాదని కేసీఆర్ పేర్కొన్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ నేరుగా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఈ కేసులో కవిత పేరు బయటకు వచ్చినా, కవితను సీబీఐ అధికారులు విచారణ చేసినా సీఎం కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడంతో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్షాల గొంతు నొక్కేందుకే కేంద్రం ఈ తప్పుడు అరెస్ట్‌లకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా, ఢిల్లీ మున్సిపల్ కార్పెరేషన్‌ను కోల్పోవడంతో బీజేపీ ఈ చర్యలకు పాల్పడినట్లు మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇక సీసోడియా అరెస్ట్‌పై కేరళ సీఎం కూడా స్పందించారు. ప్రజాస్వామ్యంపై దాడిగా దీనిని అభివర్ణించారు.