తెలంగాణ రాష్ట్రం అవతరించి పది సంవత్సరాలు కావోస్తున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
CM KCR On Formation Day: తెలంగాణ రాష్ట్రం అవతరించి పది సంవత్సరాలు కావోస్తున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాగా, దీనిపై నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయం, విద్యుత్, సంక్షేమం సహా అన్ని రంగాల్లో సాధించిన ప్రగతిని, విజయాలను పల్లె పల్లెల్లో ప్రజలకు వివరించాలని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
21 రోజులపాటు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించనున్నారు. జూన్ 2న ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ఉత్సవాలను సచివాలయం వేదికగా నిర్వహించనున్నారు. సచివాలయంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం జెండాను ఎగరవేయాలని నిర్ణయించారు. ఆ తరువాత అధికారిక ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉత్సవాలకు హాజరయ్యే ఆహ్వానితులకు పార్కింగ్ సౌకర్యం, అతిథులకు మర్యాదలకు సంబంధించిన అంశంపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులపాటు ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలో, కార్యక్రమాలను ఏ విధంగా చేపట్టాలో సీఎం కేసీఆర్ అధికారులకు వివరించారు. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు తెలియజేశారు. 21 రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల కోసం మంత్రులు, అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి హరీష్రావు నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. +