KCR: టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్ధేశం
KCR: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్ఎస్ పార్టీ దృష్టిసారించింది. ఇందులో భాగంగానే లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రం తరపున లేవనెత్తాల్సిన కీలక అంశాలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఈ సమావేశాల్లో ఢిల్లీ మద్యం పాలసీ, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన అంశాలను కూడా లేవనెత్తాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అభివృద్ధిని ప్రొత్సహించకుండా ద్వేషపూరితమైన రాజకీయాలు చేస్తోందని, ఈ అంశాలను సభలో లేవనెత్తి కేంద్రాన్ని ఎండగట్టాలని కేసీఆర్ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.