KCR Fires on BJP: వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాం
KCR Fires on BJP: ఢిల్లీ లిక్కర్ మాఫియా వ్యవహారంలో కేంద్ర ఏజెన్సీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. గతంలో సీబీఐ ఒకమారు కవితను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈడీ కూడా కవితకు నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. కవితకు నోటీసులు ఇవ్వడంపై ఇప్పటికే మంత్రులు అనేక మంది స్పందించారు. తాజాగా సీఎం కేసీఆర్ కూడా కవితకు నోటీసులు ఇవ్వడంపై స్పందించారు. బీజేపీ కక్షసాధింపుకు దిగుతోందని అన్నారు. గురువారం రోజున రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ కీలక విషయాలు పేర్కొన్నారు.
తెలంగాణపై కేంద్రం వివక్షను చూపుతోందని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. మిత్రపక్షాలను కలుపుకొని పోటారం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఆటలు ఇక సాగవని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇలాంటి జరిగాయని, ధైర్యంగా ఉండాలని, పార్టీ తోడుగా ఉంటుందని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీన కవిత ఈడీ ముందు హాజరుకానున్నది. ఈరోజు ఢిల్లీలో కవిత నిరసన దీక్ష చేయనున్నారు.