KCR: ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ!
KCR: బిఆర్ఎస్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల మీద క్లారిటీ ఇచ్చారు. ఈసారి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్న ఆయన నియోజకవర్గాల వారీగా మీటింగ్స్, పాద యాత్రలు చేయాలని అన్నారు. ఇక ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచనలు చేసిన కేసీఆర్ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించుకోవాలని అన్నారు. ఇక పాద యాత్రలు కూడా చేసుకోవాలని పేర్కొన్న సీఎం కేసీఆర్ ప్రజల్లోనే ఉండాలి, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని భేటీలో కేసీఆర్ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండండని కోరారు. ఇక పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. ఇక నియోజకవర్గాల వారీగా సభలు పెట్టండని పేర్కొన్న ఆయన గ్రామాల్లో, వార్డుల్లో కార్నర్ సభలు పెట్టండని అన్నారు. ఇక డిసెంబర్లోనే ఎన్నికలుంటాయని పేర్కొన్న ఆయన అభివృద్ది పనులు పెడింగ్లో లేకుండా చూసుకోండని సూచించారు. ఇక మార్చి 1 నుంచి ఏప్రిల్ వరకు పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టాలని, ఏప్రిల్ 25న గ్రామ స్థాయిలో పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటుందని అన్నారు. ఇక ఏప్రిల్ 27న ప్రతినిధుల సభ ఉంటుందని, అక్టోబర్లో వరంగల్ బహిరంగసభ ఉంటుందని అన్నారు.