CM KCR: కర్ణాటకలో సీఎం కేసీఆర్ ప్రచారం… నాగాలాండ్‌లోనూ పోటీ
CM KCR: సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కే కుమారస్వామి పూర్తి మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన నేతృత్వంలోని జేడీఎస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమౌతున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కుమారస్వామి పార్టీ తరపున కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా ప్రచారం నిర్వహించనున్నారు. కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నదే తమ లక్ష్యమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు ప్రచారం నిర్వహించనున్నారు.
డబుల్ ఇంజన్ పేరుతో ప్రచారం చేసుకుంటున్న బీజేపీ, అభివృద్ధికి దూరంగా ఉందని, తెంగాణలో పింఛన్లు రూ. 2016 ఇస్తుంటే కర్ణాటకలో కేవలం రూ. 600 మాత్రమే ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు దుయ్యబట్టారు. ఇక, కర్ణాటకలో జేడీఎస్ తరపున ప్రచారం చేస్తూనే నాగాలాండ్‌లో బీఆర్ఎస్ పార్టీని పోటీకి దించేందుకు పావులు కదుపుతున్నారు. నాగాలాండ్ ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వై సులంతుంగ్ హెచ్ లోథాతో బీఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించారు. మంత్రి కొప్పుల ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు సులంతుంగ్ ఆసక్తికనబరిచారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.