Padayatra: సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర షెడ్యూల్ విడుదల
CLP Leader Bhatti Vikramarka Padayatra from March 16th
కాంగ్రెస్ నేతలు పాదయాత్రలతో బిజీ బిజీగా మారిపోయారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో అనేక రాష్ట్రాల్లో పాదయాత్ర చేశారు. రాహుల్ అందించిన స్పూర్తితో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు మొదలు పెట్టారు. తెలంగాణలో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర షెడ్యూల్ విడుదల అయింది. 7 రోజుల పాటు జరిగే పాదయాత్ర ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది.
ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు పాదయాత్ర మొదలు కానుంది. ఉదయం 10:30కు పాదయాత్రకు బ్రేక్ ఇస్తారు. తిరిగి సా. 4:30కి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు కార్నర్ మీటింగ్ జరగనుంది. ఎల్లుండి మాత్రం సా. 4 గంటలకు పిప్రి నుంచి భట్టి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇచ్చోడలో రాత్రి బస చేయనున్నారు. రెండోరోజు ఇచ్చోడ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సిరికొండలో రాత్రి సభ, నైట్ హాల్ట్ ఏర్పాటు చేస్తున్నారు.
మూడోరోజు సిరికొండ నుంచి ఇంద్రవెల్లి వరకు భట్టి పాదయాత్ర కొనసాగనుంది. ఇంద్రవెల్లిలో కార్నర్ మీటింగ్ జరగనుంది.నాలుగోరోజు ఇంద్రవెల్లి నుంచి ఉట్నూరు వరకు భట్టి పాదయాత్ర కొనసాగుంది. ఉట్నూరులో భట్టి సభ, రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఐదోరోజు ఉట్నూరు నుంచి ఉసేగాన్ వరకు భట్టి పాదయాత్ర జరగనుంది.
ఆరోరోజు ఉసేగాన్ నుంచి బూసిమట్ట వరకు యాత్ర జరగగా… ఏడోరోజు బూసిమట్ట నుంచి జారీ వరకు భట్టి యాత్ర కొనసాగుతుంది. భట్టి పాదయాత్ర సందర్బంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.