Alai Balai: డప్పు వాయించి – డాన్స్ చేసి మెగా సందడి..!
Chiranjeevi josh in Alai Balai: అలయ్ బలయ్ వేడుకల్లో మెగాస్టార్ సందడి చేశారు. కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి కొంచెంసేపు డప్పు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. కళాకారులతో కలిసి డాన్స్ చేశారు. చిరు ఇలా చిందులు వేయడంతో ఒక్క సారిగా జోష్ కనిపించింది. గవర్నర్ దత్తాత్రేయ కుటుంబం నిర్వహించిన అలయ్ బలయ్ వేడుకల్లో ఈ పారి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కళాకారులతో కలిసి డప్పు వాయించారు. వారితో పాటుగా స్టెప్పులు కలిపారు. తన గాడ్ ఫాదర్ విడుదల అయి సక్సెస్ ఇచ్చిన మరుసటి రోజునే ఈ కార్యక్రమానికి హాజరు కావటం సంతోషంగా ఉందన్నారు. తన సినిమా సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ నీ పిలిచారు, అల్లు అరవింద్ నీ పిలిచారు కానీ, తనను ఈ కార్యక్రమానికి నన్ను ఎందుకు ఆహ్వానించడం లేదో అని అనుకునే వాడినని పేర్కొన్నారు.
1980 దశకం లో సినీ ఇండస్ట్రీ లో ఏహ్యభావం ఉండేదని గుర్తు చేసారు. ఒక హీరో సినిమా సక్సెస్ అయితే, మరో హీరో అభిమానులు వాల్ పోస్టర్ లను చించేవారని చెప్పుకొచ్చారు. తాను హీరో కాగానే ఈ సంస్కృతి నీ మార్చాలని అనుకున్నానన్నారు. సినిమా రిలీజ్ ముందుకు అందరూ హీరోలను పిలిచే వాడినని చెప్పారు. అందరికీ పార్టీ ఇచ్చేవాడినని వివరించారు. తెలంగాణ సంస్కృతి ను దత్తన్న కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారని అభినందించారు. తాను బ్లడ్ బ్యాంకు నిర్వహిస్తుంటే రక్తం అమ్ముకుంటున్నాడంటూ తప్పుడు ఆరోపణలు చేసేవారని..ఈ తరువాత వారే వాస్తవం ఏంటో గుర్తించారని చెప్పుకొచ్చారు. కోపం – ఇగోలను పక్కన పెట్టి ఒక్క సారి అలయ్ బలయ్ చేసుకుంటే ఎవరి మధ్య ద్వేష భావాలు ఉండవని చిరంజీవి పేర్కొన్నారు. ఏ కార్యక్రమం అయిన ఒక ఉద్దేశంతో చేపడతారని.. ఏ రకమైన రాజకీయాలకు అవకాశం లేకుండా అలయ్ బలయ్ నిర్వహించటం అభినందీనీయమన్నారు.