Padma Bhushan Awards: ఆద్యాత్మికం… పద్మభూషణం
Chinna Jeeyar and Kamlesh Patel gets Padma Bhushan Award: కేంద్ర ప్రభుత్వం పద్మపురస్కారాలను ప్రకటించింది. కాగా, తెలంగాణకు చెందిన ఐదురుగుకి పద్మ అవార్డులు దక్కాయి. ఇందులో రెండు పద్మ భూషణ అవార్డులు ఉండటం విశేషం. ప్రముఖ ఆద్యాత్మిక గురువు చిన జీయర్ స్వామికి, రామచంద్ర మిషన్ హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్యాత్మిక వేత్త కమలేష్ డీ పటేల్‌కు ఈ అవార్డులు దక్కడం విశేషం. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో వీరు ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పెద్ద జీయర్ స్వామివారి వద్ద చిన జీయర్ స్వామివారు శిష్యరికం చేశారు.
అనంతరం హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ముచ్చింతల్ వద్ద జీయర్ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమంలోనే ఇటీవలే 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమతామూర్తి విగ్రహంతో పాటు 108 దివ్యదేశాలను కూడా ఈ ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సమతామూర్తి విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
కాగా, పద్మభూషణ్‌కు ఎంపికైన మరోఆధ్యాత్మికవేత్త గురూజీ కమలేష్ డీ పటేల్ రంగారెడ్డి జిల్లాలోని నందిగామ పరిధిలో కన్హా శాంతివనంలో రామచంద్రా హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థద్వారా ఎందరినో ఆధ్యాత్మికంగా గైడ్ చేస్తున్నారు. రామచంద్రా మిషన్ 160 దేశాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. తెలంగాణ నుండి ఇద్దరు ఆధ్యాత్మిక వేత్తలకు పద్మభూషణ్ పురష్కారాలు లభించడం విశేషం.