తెలుగు రాష్టాల్లో హాట్ టాపిక్ గా మారిన కేసినో కింగ్ గా గుర్తింపు పొందిన చీకోటి ప్రవీణ్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారా? అంటే, అవుననే సమాధానం వస్తోంది.
Chikoti Praveen : తెలుగు రాష్టాల్లో హాట్ టాపిక్ గా మారిన కేసినో కింగ్ గా గుర్తింపు పొందిన చీకోటి ప్రవీణ్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. త్వరలో రాజకీయ అరగేట్రం చేస్తాను అని స్వయంగా చీకోటి ప్రవీణ్ చెప్పారు. పాలిటిక్స్ లోకి ఎంట్రీపై త్వరలో ప్రకటన చేస్తాను అన్నారు. తాను రాజకీయాల్లోకి రాకుండా కొందరు తనపై రూమర్స్ చేస్తున్నారని చీకోటి ప్రవీణ్ ఆరోపించారు. అయితే ఏ పార్టీలో చేరేది అనేది త్వరలో తెలియచేస్తానన్నాడు.
థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో సోమవారం ఈడీ విచారణకు హాజరైన చికోటి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసాడు. ఒక ప్లేయర్గా మాత్రమే థాయిలాండ్ వెళ్ళాను. కానీ నకిలీ సర్టిఫికెట్స్తో నాకు ఇన్విటేషన్ పెట్టారు. అది తెలుసుకొని అక్కడ ఉన్న న్యాయస్థానం మాకు 2000 బాత్(థాయ్లాండ్ కరెన్సీ)లు ఫైన్ విధించింది. ఫైన్ లేదన్నారు. ఈడీ ప్రశ్నలకు సమాధానం చెప్పాను అన్నారు. తాను రాజకీయాల్లోకి రాకుండా కొందరు రూమర్స్ చేస్తున్నారని ఆయన చెప్పారు. దర్యాప్తు సంస్థ ఈడీ మీద మాకు పూర్తి నమ్మకం ఉందన్నారు ప్రవీణ్. త్వరలోనే రాజకీయ ప్రవేశం ఉంటుందని తెలిపాడు. ఇక చికోటికి ఆంధ్రలో వైసీపీ, తెలంగాణ లో బిఆర్ఎస్ నేతలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయి. మరి చేరితే ఈ రెండు పార్టీలలో ఎదో ఒకదాంట్లో చేరే అవకాశమైతే కనబడుతుంది.