Airport Metro: సవాలుగా మారిన శంషాబాద్ మెట్రోప్రయాణం
Airport Metro: రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మార్గంలో మెట్రో నిర్మాణానికి సంబంధించి సంబంధిత అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ మార్గంలో మెట్రో ప్రాజెక్టులో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్ వరకు మెట్రో నిర్మాణానికి ఎంతో కష్టంతో కూడుకున్నపని ఎన్నోమలుపులు ఎత్తైన భవనాలు ఉన్నాయ్. ఒక్కో దానికి ఒక్కో విధమైన పరిష్కార మార్గాన్ని చూపేందుకు ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రతిపాదిత మెట్రో మార్గంలో భూ సేకరణ సమస్య తక్కువగా ఉన్నప్పటికి వెళ్లే మార్గంలో ఉన్న ఫ్లై ఓవర్లు, కొండ ప్రాంతాలే అధికారులకు సవాలుగా మారుతున్నాయి. కొండలను చీల్చకుండా మెట్రో మార్గం కోసం పిల్లర్లను నిర్మించాల్సి వస్తున్నది. రాజేంద్రనగర్, హిమాయత్‌సాగర్ చెరువు, కొత్వాల్ గూడ ప్రాంతంలోనే గుట్టలున్నాయి. రాజేంద్రనగర్ వద్ద భారీ ఎత్తయిన రాళ్లతో కూడిన కొండ ప్రాంతం ఉండడంతో కేవలం ఓఆర్‌ఆర్ ప్రధాన రహదారిని 8 వరసలతో నిర్మించి, ఇరువైపులా ఉండాల్సిన సర్వీసు రోడ్డును ఒకవైపు నుంచే మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని ఈసీ నది, ఎత్తయిన కొండ రావడంతో సర్వీసు రోడ్డు లేకపోవడంతో కొండలను తొలిచి మెట్రో మార్గాన్ని నిర్మించాల్సిన పరిస్థితి నెలకొంది. మెట్రో మార్గాన్ని మళ్లించే అవకాశాలు లేకపోవడంతో కొండలను తొలిచి మార్గాన్ని నిర్మించేందుకు భూమిని చదును చేయనున్నారు.