Kishan reddy: సింగరేణిని కల్వకుంట్ల కంపెనీగా మార్చే కుట్ర చేశారు- కిషన్ రెడ్డి
Central Minister Kishan reddy Counter to TRS on Singareni
సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారని టిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిలో 51 వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిది కేంద్ర ఏ నిర్ణయం తీసుకోలేదని కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదని ప్రధాని మోడీ రామగుండం సభలో స్పష్టం చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
గుజరాత్ రాష్ట్రానికి బొగ్గు గనులు అలాట్ చేస్తున్నారని, గుజరాత్‌కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా అంటూ మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అభద్రతా భావంతో టిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణిని…. కల్వకుంట్ల కంపెనీగా మార్చే కుట్ర చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
బొగ్గు ఉత్పత్తిలో దేశం 4వ స్థానంలో ఉన్నదని, బొగ్గు గనులు ఓపెన్ ఆక్షన్ ద్వారా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా కిషన్ రెడ్డి తెలిపారు. కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు బొగ్గు సరిగ్గా తీయలేక పోతున్నాయని, బొగ్గు ఉత్పత్తి పెంచే దిశగా పోటీ తత్వం పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని కూడా కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని స్పష్టం చేశారు.