Delhi liquor Scam: ఏడున్నర గంటల పాటు కవితను విచారించిన సీబీఐ
CBI records TRS MLC Kavitha Statement
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా ఈ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో విచారించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 6.30 వరకు సాగింది. ఏడున్నర గంటల పాటు కవిత ఇంట్లోనే ఉన్న విచారణ అధికారులు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. కవిత చెప్పిన సమాధానాలను రికార్డు చేశారు.
లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారణ ఎదుర్కొన్న వ్యాపార వేత్త అమిత్ అరోరా, కవిత పేరు ప్రస్తావించాడు. ఆమె ప్రమేయం కూడా ఉందని తెలిపడంతో సీబీఐ అప్రమత్తం అయింది. కవిత నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి ప్రయత్నించారు.
ఈ రోజు ఉదయం 10.50 నిమిషాలకు కవిత ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. సీబీఐ టీమ్‌లో ఓ మహళా అధికారి కూడా ఉన్నారు. సరిగ్గా 11గంటలకు విచారణ ప్రారంభించారు. మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ సాయంత్రం ఆరున్నర గంటల వరకు వివిధ అంశాలపై కవితను ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన కవిత, తన దగ్గర ఉన్న సమాచారాన్ని సీబీఐకి అందజేశారు.