CBI: అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ పూర్తి, నాలుగున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం
CBI interrogation to MP Avinash Reddy in YS Viveka Murder Case
ఏపీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు నా్ల్గవ సారి విచారించారు. న్యాయవాది నాగార్జున సమక్షంలో అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలో విచారణ కొనసాగింది.
విచారణ నుంచి ఈ సారికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులకు అవినాశ్ రెడ్డి లేఖ రాశారు. సీబీఐ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
విచారణ నుంచి మినహాయింపు కోసం అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు విచారణ నుంచి మినహాయింపు కావాలని అవినాశ్ రెడ్డి హైకోర్టును కోరారు. అవినాశ్ రెడ్డి అభ్యర్ధనను హైకోర్టు కొట్టివేసింది.