Liquor Scam: మరోసారి కవితను విచారించనున్న సీబీఐ
CBI: ఆదివారం రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను విచారించారు. 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరిగింది. ఈ కేసులో తమకు కావాల్సిన పత్రాలు, డాక్యుమెంట్స్ సాక్షాలు ఇవ్వాలని 91 నోటీసుల్లో పేర్కొన్నారు. 91 సీఆర్పీసీ విచారణ వివరాలను, తేదీలను, ప్లేస్‌లో త్వరలోనే మెయిల్ ద్వారా తెలియజేస్తామని సీబీఐ అధికారులు కవితకు తెలిపారు.
కవిత వద్ద ఉన్న డాక్యుమెంట్స్ లేదా డివైజ్‌లను ఇవ్వాలని సీఆర్పీసీ 91 నోటీసుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పేరు కూడా బయలకు రావడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అలజడి రేగింది. కవితను విచారిస్తున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కొందరు నేతలు ఆమె ఇంటివద్ద సీబీఐకి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తామని చెబుతూనే ఎందుకు నిరసనలు చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దర్యాప్తు సంస్థలు చాయ్ బిస్కేట్లు తాగడానికి రాలేదని, స్కామ్ లో ఎవరి పాత్ర ఏంటో నిగ్గు తేల్చందుకే వచ్చారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.