Cat Kidnap: హైదరాబాద్‌లో పిల్లి దొంగతనం..రంగంలోకి పోలీసులు
Cat Kidnap: పెంపుడు జంతువులైన కుక్కలను దొంగిలించడం చూశాం.. కానీ పిల్లులను కూడా దొంగతనం చేస్తున్నారు. అరుదైన జాతికి చెందిన ఓ పిల్లిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వనస్థలిపురం పరిధిలోని జహంగీర్ కాలనీలో షేక్‌అజహార్ మహమూద్ అనే వ్యక్తి పెంచుకుంటున్న పిల్లిని ఎవరో దొంగిలించారు. అరుదైన జాతికి చెందిన ఓ పిల్లిని రూ. 50 వేలకు కొన్నానని 18 నెలల వయసు ఉన్న ఆ పిల్లి దొంగతనం అయిందని ఫిర్యాదు చేశారు.
18 నెలల వయసు ఉన్న ఆ పిల్లికి నోమనీ అని నామకరణం చేశారు. పిల్లి కళ్లలో ఒకటి డైమండ్ కలర్, మరొకటి రెడిష్ గ్రే రంగుల్లో ఉండటం దీని ప్రత్యేకత. ఆదివారం రాత్రి నుంచి పిల్లి కనిపించకుండాపోయింది. కనిపించకుండా పోయిన పిల్లి అరుదైన హౌ మనీ జాతికి చెందినగా చెప్పాడు.. చుట్టుపక్కల వెతికిని ఫలితం లేకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి స్కూటీపై వచ్చి ఎత్తుకెళ్లినట్లు రికార్డైంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పిల్లికోసం పోలీసులు రంగప్రవేశం చేసారు.