Women Employees : మహిళా ఉద్యోగులకు ఆరోజు సెలవు
Women Employees: ఈ సృష్టికి మూలం స్త్రీ ఆమె లేకపోతే మనుగడే కష్టం. సమాజంలో మహిళ పాత్ర ఎంతో ఉంటుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నడిచే యంత్రంలా ఆమె పరుగులు పెడుతూనే ఉంటుంది. ఎంత సేపు కుటుంబం, బాధ్యతలు ఇవే ఆమె మదిలో మెదులుతుంటాయి. మరి ఆమె బాగుంటేనే సమాజం బాగుంటుంది. అలాంటి మహిళ.. కనీసం ఒక్క రోజు అయినా తన గురించి తాను సమయం కేటాయించుకోవాలని.. ఆమె శ్రమను గుర్తించడం కోసం అంతర్జాతీయ సమాజం మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలని భావించింది. దీనిలో భాగంగా మార్చి 8న మహిళా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది.
ఇక మహిళ అభ్యున్నతికోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మహిళ ఉద్యోగులందరికీ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.