Cantonment Board: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు!
Cantonment Board: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ, కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాత్రమే కాదు దేశంలోని అన్ని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ గెజిట్ విడుదల చేసింది. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ కూడా రద్దైనట్టు అయింది. ఫిబ్రవరి 17 తేదీ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నిర్వహణకు రక్షణ శాఖ విడుదల చేసిన ఎలక్షన్ రద్దు చేసింది. ఇటీవల కంటోన్మెంట్ బోర్డులను స్థానిక సంస్థల్లో కలపుతారని, రక్షణ శాఖ సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది.
మధ్యలో ప్రత్యుత్తరాలు కూడా నడిచాయి కానీ ఎలక్షన్స్ కు గెజిట్ ఇచ్చారు. మళ్లీ ఇవాళ వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక కంటోన్మెంట్ బోర్డులను స్థానిక సంస్థల్లో కలిపే అవకాశం ఎక్కువగా ఉందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు చెబుతున్నారు. ఎలక్షన్ల రద్దును తాము స్వాగతీస్తున్నామని వారు వెల్లడించారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఎనిమిది వార్డులు ఉన్నాయి. 2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు జరిగాయి, 2020 ఫిబ్రవరిలో కంటోన్మెంట్ బోర్డు పాలకవర్గం గడువు ముగియగా కేంద్రం నామినేటెడ్ సభ్యుడిని నియమించింది.