C V Anand: నుమాయిష్‌లో పోలీస్ స్టాల్స్ ప్రారంభించిన సీవీ ఆనంద్
C V Anand inagurated Police Stalls in Nampally Numaish
నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ట్రాఫిక్ పోలీస్ స్టాల్‌ను ప్రారంభించిన హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులు అంతా…పోలీస్ స్టాల్స్ ను సందర్శించాలని కోరారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన పెంచుకుంటే, ప్రమాదాలు నివారించవచ్చరి సీవీ ఆనంద్ ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు.
పాఠశాల స్థాయి నుంచే…ట్రాఫిక్ రూల్స్ పట్ల ఎలా అవగాహన తెచ్చుకోవాలో సూచించారు. చిన్నారుల చేత అవగాహన కల్పిస్తున్నామని ఆనంద్ వివరించారు.
ట్రాఫిక్ పోలీస్ స్టాల్‌తో పాటు సైబర్ క్రైమ్, భరోసా కేంద్రాలను కూడా సీవీ ఆనంద్ ప్రారంభించారు. మహిళల జాగ్రత్తల కోసం భరోసా సెంటర్‌ను సందర్శించాలని సూచించారు. పెరిగిపోతున్న సైబర్ నేరాలకు సంబంధించిన అవగాహన ప్రజలకు అవసరమని ఆనంద్ అభిప్రాయపడ్డారు. అందుకే… ఎగ్జిబిషన్‌లో ఈ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
ఈ సందర్భంగా చిన్న నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. మా అమ్మ షాపింగ్ బిజీలో వుంటే…నేను ఇక్కడ ఆడుకునే వస్తువులతో…సరదాగా గడిపే వాడినని గుర్తుచేసుకున్నారు.
#HYDTPinfo
Sri G. Sudheer Babu, IPS @AddlCPTrHyd visited n reviewed the traffic stall ready for inauguration by Sri C.V. Anand, IPS @CPHydCity in Exhibition Grounds.
Sri N. Prakash Reddy, IPS DCP Tr-I, Sri P. Karunakar, @DCPTraffic2Hyd n other @HYDTP officers were present. pic.twitter.com/vpBUwrJ1cb— Hyderabad Traffic Police (@HYDTP) January 11, 2023
జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్
జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ నెలన్నర రోజుల పాటు నగర వాసులకు అందుబాటులో ఉండనుంది. ప్రవేశ ధరను 40 రూపాయలకు పెంచారు. పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ సారి ఏర్పాటు నుమాయిష్‌లో మొత్తం 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అదే విధంగా వైద్య సేవలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3.30 నిమిషాల నుంచి రాత్రి 10.30 నిమిషాల వరకు నుమాయిష్ సందర్శకులను అలరిస్తోంది.