BRS Women leaders: రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ మహిళా నేతల అరెస్టుకు యత్నం!
BRS Women leaders: తెలంగాణ రాజ్‌భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజ్‌భవన్ వద్దకు మేయర్ సహా బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లు చేరుకుని రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ మహిళా నేతలు యత్నించారు. ఈ క్రమంలో మేయర్, బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లను అడ్డుకున్న పోలీసులు, గవర్నర్ అపాయింట్‌మెంట్ లేదని లోపలికి వెళ్ళనివ్వం అంటూ పోలీసులు పేర్కొన్నారు. దీంతో రాజ్‌భవన్ ఎదుట బైఠాయించిన మేయర్, కార్పొరేటర్లు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఉదయం నుంచి గవర్నర్ సమయం ఇవ్వట్లేదన్న మహిళా నేతలు, గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసేంతవరకు వెళ్లేది లేదని మేయర్ తేల్చి చెప్పారు. రాజ్‌భవన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు లోపలి వెళ్ళనివ్వక పోవడంతో వారంతా అక్కడే భైటాయించారు. ఈ క్రమంలో రాజభవన్ వద్ద నిరసనకు దిగిన కార్పొరేటర్లను పోలీసులు తరలించే ప్రయత్నం చేయగా వారంతా ఖైరతాబాద్ వైపు ర్యాలీగా వెళ్తున్నారు. కవితపై సంజయ్ వ్యాఖ్యలపై కంప్లైంట్ ఇచ్చేందుకు రాజ్ భవన్ కి రాగా అపాయింట్మెంట్ లేదని లోపలికి అనుమతించ లేదు. దీంతో గోడకు వినతిపత్రం అంటించి రోడ్డుపై బైఠాయించి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారుమ్ ఈ క్రమంలోనే కార్పొరేటర్లను తరలించే ప్రయత్నం చేశారు.