బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక విషయాలను ప్రస్తావించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల విషయంపై కూడా కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
BRS will get 105 seats if assembly elections are held immediately, says KCR
బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక విషయాలను ప్రస్తావించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల విషయంపై కూడా కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో మనం చేసింది ప్రజలకు చెబితే చాలని కేసీఆర్ పార్టీ శ్రేణులను కోరారు.
టీఆర్ఎస్ సమావేశంలో మంత్రులకు సీఎం కేసీఆర్ క్లాస్
బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో అధినేత కేసీఆర్ మంత్రులకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను కలుపుకొని పోవాలని మంత్రులకు గట్టిగా సూచించారు. మంతులు వాళ్లతో సమావేశాలు నిర్వహించడం లేదని సీఎం కేసీఆర్ మందలించారు.
వారం లోపల అందర్నీ పిలిచి సమావేశాలు పెట్టండని ఆదేశించారు. జూన్ రెండు నుంచి జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్సీ లను ,ఎంపిలను ,జెడ్పీ చైర్మన్లను పిలవండని కేసీఆర్ ఆదేశించారు.
చెరువుల దగ్గర రైతులతో సమావేశం
రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్ పెట్టండని, చెరువు గట్ల మీద రైతుల తో కలిసి భోజనం చేయండని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్లలో చేసిందేమీ లేదని కేసీఆర్ ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీకి 105 సీట్లు
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 105 సీట్లు ఖచ్చితంగా వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మంత్రులు ఆయా జిల్లాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. గడిచిన పదేళ్లు ఏం చేశామో ప్రజలకు చెప్పండని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.