BRS Party: 10న బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక సమావేశం
BRS Party: మార్చి 10న భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షం, రాష్ట్ర కార్యవర్గం, సమావేశం కానుంది. తెలంగాణ భవన్‌లో మార్చి 10న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సంయుక్త సమావేశానికి హాజరుకావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. మరోవైపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు మంత్రిమండలి సమావేశం ప్రగతి భవన్‌లో గురువారం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు రానున్నాయి.
రేపు జరుగబోయే సమావేశానికి జెడ్పీ, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్‌లు కూడా హాజరుకానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ పార్టీ కార్యాచరణపై నేతలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు.. పార్టీ కార్యకలాపాలు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చ సాగే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఆహ్వానం అందిన ప్రతీ ఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశించారు.