BRS @ MH: ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ…
BRS Public Meeting on Feb 5th in Nanded: బీఆర్ఎస్ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా తొలి సభను ఢిల్లీలో కాకుండా ఖమ్మంలో నిర్వహించగా, రెండో సభను ఏపీలో నిర్వహించాలని మొదట అనుకున్నా, అనుకోని కారణాల వలన అమరావతిలో కాకుండా మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించనున్నారు. నాందేడ్ తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్‌లో ఉండటంతో అక్కడ తెలుగు ప్రజలు కూడా ఎక్కువగా నివశిస్తున్నారు. దీంతో వీరిని ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరే విధంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
గత మూడు రోజులుగా కేసీఆర్ మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలతో మంతనాలు జరుపుతుననారు. ఖమ్మంలో ఏవిధంగా అయితే పెద్ద ఎత్తున సభను నిర్వహించి జనసమీకరణనను చేపట్టారో అదేవిధంగా నాందేడ్ లో కూడా సభను నిర్వహించి సక్సెస్ చేయాలని నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సభద్వారా మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఎవరు చేరబోతునన్నారు అన్నది స్పష్టతరావాల్సి ఉన్నది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని ఇప్పటికే ప్రకటించగా, నాందేడ్ సభ ద్వారా మహారాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.