మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగబతున్నాయి.. తెలంగాణ ఎన్నికల కంటే ముందు దేశంలోని కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేడు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్టీ నేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ నేతలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు
CM KCR: మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.. తెలంగాణ ఎన్నికల కంటే ముందు దేశంలోని కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేడు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్టీ నేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ నేతలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తరువాత జరిగుతున్న విస్తృతస్థాయి సమావేశాలు కావడంతో కీలక విషయాలపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీపై అస్త్రాలను ఎక్కుపెట్టారు. దేశానికి గుజరాత్ మోడల్ అక్కర్లేదని ప్రజలు తెగేసి చెబుతున్నారని, తెలంగాణ మోడల్‌కు ప్రజలు జై కొడుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.
మహారాష్ట్రలో సభను నిర్వహించిన సమయంలో ఓ అధికారి దేశానికి తెలంగాణ మోడల్ అవసరం ఉందని చెప్పినట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంచిపనులు చేస్తేనే ప్రజలు గుర్తిస్తారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన పథకాలనే అమలు చేస్తున్నామని, చేస్తున్న పనులను బయటకు చెప్పుకోవడం లేదని అన్నారు. కులాలు, మతాల రాజకీయాలకు తెరపడిందని, అటువంటి పాలిటిక్స్‌ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. తెలంగాణ ప్రజలే భగవద్గీత, వేదాలని, తెలంగాణ ప్రజలకు అవసరమైన పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. అంశాల వారీగా రాజకీయాలు చేయాలని, కులమత రాజకీయాలు అవసరం లేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చేస్తున్నాం కాబట్టే రెండుసార్లు అధికారంలోకి వచ్చామని, మూడోసారి కూడా అధికారంలోకి వస్తామని, ఈసారి 100 సీట్లకు పైగా గెలుచుకుంటామని సీఎం కేసీఆర్ తెలియజేశారు.