Telangana: మోడీ ఇక్కడ పోటీ చేస్తే, ఓడించి ఇంటికి పంపుతాం-బీఆర్‌ఎస్ నేతలు
BRS Ministers counter attack on AP leaders
బీఆర్‌ఎస్‌పై వస్తున్న విమర్శలను ఆ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తిప్పి కొట్టారు. కేసీఆర్ అంటే ఆంధ్రావాళ్లకు గిట్టదు అని ప్రచారం చేసిన వాళ్లకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్ర ప్రాంతం నుంచే బీఆర్‌ఎస్‌లో ఎక్కువ మంది చేరుతున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఆంధ్రలో కొన్ని ప్రాంతాల ప్రజలు కేసీఆర్ నాయకత్వం ఉంటే బాగుండు అనుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
భారత దేశంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోకుండా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు. 40,000 చెరువులను పునరుద్ధరించి నీటి ఉటగా మార్చింది బీఆర్‌ఎస్ అని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కితాబు ఇస్తున్నారని జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు.
మరోవైపు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పేరంటేనే మోడీకి మంట అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లో కి నెట్టాలని ప్రధానితో సహా కేంద్ర మంత్రులు పని చేస్తున్నారు. మోడీ తెలంగాణలో పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతోందని, అదే నిజమైతే మోడీని ఓడించి ఇంటికి పంపిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల పొట్ట గొట్టి నిధులు ఇవ్వకుండా మోడీ పైశాచికంగా వ్యవహరిస్తున్నాడని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.