MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ నేతలు
BRS leaders filed Nominations for MLC elections
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులకు సమర్పించారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నామినేషన్ల దాఖలు చేయడానికి ముందు ఎమ్మెల్సీ అభ్యర్థులందరూ గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి అమరులకు నివాళులర్పించారు.
మార్చి 23న పోలింగ్
మార్చి 13 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా..మార్చి 14న నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 16న నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగియనుంది. మార్చి 23న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు.
ముగిసిన పదవీ కాలం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్‌ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. వారి స్థానాల్లో కొత్త వారు ఎంపిక కానున్నారు. కేసీఆర్ ఎంపిక చేసిన ఈ ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనమే అని తెలుస్తోంది.
ఈరోజు అసెంబ్లీలో జరిగిన MLA కోటా లో MLC అభ్యర్థులుగా నవీన్ రావు, దేశపతి శ్రీనివాస్ లు నామినేషన్ లను సమర్పించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. pic.twitter.com/PTmlmsBMJn
— Talasani Srinivas Yadav (@YadavTalasani) March 9, 2023