TRS Dharna: పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ మహాధర్నా
BRS Dharna against hike in Gas Cylinder rates
గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు అధికార పార్టీ నాయకులు మహాధర్నా చేపట్టారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు గ్యాస్ సిలిండర్లు, కట్టెల మోపులతో వినూత్నంగా నిరసన తెలియజేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోను గులాబీ నేతలు ఆందోళనలు చేపట్టారు. గ్యాస్ ధరల పెరుగుదలను నిరసించారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. మహిళా నేతలు కూడా భారీ స్థాయిలో పాల్గొన్నారు. గ్యాస్ సిలండర్లతో కలిసి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఆర్ధిక మంత్రి హరీశ్ రావు మేడ్చల్ జిల్లాలో గులాబీ నేతలు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాన్యుడిపై మరింత భారం పెరిగే విధంగా మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సామాన్యులపై భారం తగ్గించాలని కోరారు.
పెరిగిన గ్యాస్ ధరలు
వంట గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ సహా.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 మేర పెరిగింది. దీంతో 14.2 కేజీల డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ రేటు ఫిబ్రవరి 28 వరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.1105గా ఉండగా.. ఇప్పుడు పెంచిన రేటుతో ఆ ధర రూ.1155 అయింది.
Carried out a protest in Dubbak against the Gas price hike along with @KPRTRS.
(BRS) on Thursday launched protests over the hike in prices of commercial LPG cylinders & domestic LPG cylinders across the State.Demanded that the Centre withdraw the hike.@PMOIndia @BJP4India pic.twitter.com/0I4vygL8To
— farooq hussain (@mlcfarooq) March 2, 2023
As per KTR's call, a protest and dharna held at the Mahatma Gandhi statue on MG Road, Secunderabad Ramgopalpet division under the leadership of minister Talasani Srinivas Yadav Garu ,Sri Athelli Aruna Srinivas goud garu,
BRS division leader's ,members participated— M.PRASHANTH SINGH RAJPUTH BRS (@rajputh_m) March 2, 2023
Participated in Dharna today
గ్యాస్ బండ పేద ప్రజల మీద గుది బండ
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు
పెంచిన గ్యాస్ ధరల పై రాస్తా రోకో #BRS పార్టీ అధ్వర్యంలో #Huzurnagar pic.twitter.com/ytKjISQBZU— Ravi (@Affiliated2Ts) March 2, 2023