బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు పూర్తయి సందర్భంతో పాటు, ఆవిర్భావ ఉత్సావాలు కూడా ఏ విధంగా నిర్వహించాలి, ఉత్సవాల్లో పార్టీ శ్రేణుల భాగస్వామ్యం ఎలా ఉండాలనే విషయంలో పార్టీ శ్రేణులకు అధినేత దిశా నిర్ధేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
BRS Crucial Meet started in Hyderabad
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు పూర్తయి సందర్భంతో పాటు, ఆవిర్భావ ఉత్సావాలు కూడా ఏ విధంగా నిర్వహించాలి, ఉత్సవాల్లో పార్టీ శ్రేణుల భాగస్వామ్యం ఎలా ఉండాలనే విషయంలో పార్టీ శ్రేణులకు అధినేత దిశా నిర్ధేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. అటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంలో కూడా అధినేత కేసీఆర్ పార్టీ కేడర్‌కు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. తెలంగాణలో గ్రామ గ్రామాన కూడా పదేళ్ల సంబరాలు ఘనంగా నిర్వహించే విషయంలో కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావన జరగదని సీనియర్ జర్నలిస్టులు కొందరు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావించినా కేంద్రం అందుకు అంగీకరించదని విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో కేసీఆర్‌కు సత్సంబంధాలు లేనికారణంగా ముందస్తు ఎన్నికలు జరగవని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ ఒవవేళ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నించినా అది జరగదని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.