BRS- BJP Leaders: బీజేపీ నేతలతో బీఆర్ఎస్ మంత్రుల ముచ్చట్లు వైరల్!
BRS- BJP Leaders Talk: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను కొద్దిరోజుల ముందే పండుగ సందర్భంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ఈ ప్రారంభోత్సవంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అదేమంటే పొద్దున లేస్తే పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందా అనే విధంగా ఒకరి మీద ఒకరు పరస్పర విమర్శలతో విరుచుకుపడే భారత రాష్ట్ర సమితి అలాగే భారతీయ జనతా పార్టీ నేతలు ఒకే వేదిక మీద ఉండడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకున్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఒకపక్క మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుకుంటూ కనిపించగా మరోపక్క బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా రాజకీయాలు ప్రజల ముందే అని ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఇలా పార్టీలకు అతీతంగా నేతలు అందరూ కలిసి మాట్లాడుకుంటారు అన్నమాట అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వేర్వేరు పార్టీలలో ఉన్నమాత్రాన కొట్టుకు చావాలా? ఇలా కలిసినప్పుడు కష్ట సుఖాలు షేర్ చేసుకుంటే తప్పేంటి అని కామెంట్ చేస్తున్నారు. మరి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.