బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. బ్రిటన్, భారత దేశాలకు చెందిన పలు అంశాలను చర్చించారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలతో యూకేకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకున్నారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటీలను మెగాస్టార్ ట్వీట్ చేశారు. బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని కూడా చిరు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వైన్ ఓవెన్‌కు తన ఇంటి వద్దే విందు ఏర్పాటు చేశానని, మన తెలుగు వంటకాల రుచులను చూపించానని, నోరూరించే అవకాయను కూడా రుచి చూశారని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
Delighted to meet Gareth Wynn Owen @UKinHyderabad the new British Dy High Commissioner in town.Exchanged courteous notes on many topics of UK,India & Telugu states over dinner at my place. Got him to taste some traditional Telugu delicacies,not to forget some spicy #Avakaya 😊 pic.twitter.com/CF8rx7bUBS
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 1, 2022
మెగాస్టార్‌తో భేటీ తర్వాత బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ట్వీట్ చేశారు. టాలీవుడ్ పరిశ్రమతో కలిసి పనిచేసే విషయంలో మెగాస్టార్‌తో చర్చించానని గారెత్ వైన్ ఓవెన్ తెలిపారు. కరోనా సమయంలో మెగాస్టార్ చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రశంసించానని గారెత్ వైన్ ఓవెన్ ట్వీట్ చేశారు.
Elated to meet @KChiruTweets. We discussed about collaboration between the UK and thriving Tollywood industry. Appreciated him on the expansive charity work over the years and during the Covid period.
Look forward to continuing the conversation! pic.twitter.com/sG0mxGfWX3
— Gareth Wynn Owen (@UKinHyderabad) November 1, 2022
గారెత్ వైన్ ఓవెన్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల వ్యవహారాలను చూసేందుకు గాను బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్‌తో ఈ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాపార సంబంధాలను మెరుగుపరిచచే బాధ్యత ఆయనపైనే ఉంది. వ్యాపార సంబంధాలతో పాటు విద్యా రంగంలో కూడా తెలుగు రాష్ట్రాలతో కలిసి అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.