హైదరాబాద్ లో రోజురోజుకు కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక చిన్నారిని వీధి కుక్కలు అత్యంత దారుణంగా కొరికి చంపేసిన విషయం తెల్సిందే.
Street Dogs Attack: హైదరాబాద్ లో రోజురోజుకు కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక చిన్నారిని వీధి కుక్కలు అత్యంత దారుణంగా కొరికి చంపేసిన విషయం తెల్సిందే. ఆ సంఘటన తర్వాత కొన్ని రోజుల పాటు ప్రభుత్వ అధికారులు వీధి కుక్కల విషయంలో హడావుడి చేశారు. ఆతరువాత చేతులు దులిపేసుకున్నారు. నగరంలో వందల కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టామని చెబుతున్న ఇంకా నగరంలో వేలకొద్దీ ఊరకుక్కలు సంచరిస్తున్నాయి. వీటి దాడికి నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ప్రతి రోజు ఏదో ఒక మూల కుక్కలు చిన్న పిల్లలపై దాడి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినాకూడా ప్రభుత్వంలో చలనంలేదు. తాజాగా హైదరాబాద్ కంచన్ బాగ్ లో వీధికుక్కలు మూడేళ్ళ బాలుడిని గాయపరచాయి. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్ డీఓ టౌన్షిప్లో ఐదు కుక్కలు మూడేళ్ల బాలుడిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాయి. ట్యూషన్ నుంచి వస్తుండగా చిన్నారిపై ఒక్కసారిగా కుక్కలు విరుచుకుపడ్డాయి. తీవంగ్రా గాయపడ్డ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎక్కువ రక్తం పోవడంతో బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. వీధి కుక్కలపై జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలుడి తల్లిండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుక్కల నియంత్రణకు స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.