Bollaram Rashtrapati Nilayam: ఇకపై ఏ రోజైనా వెళ్లొచ్చు
Bollaram Rashtrapati Nilayam: ప్రతి ఏడాది వేసవి, శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్ నగరం వస్తుంటారు. హైదరాబాద్‌లో కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. రాష్ట్రపతి విడిది చేసిన వెళ్లిన తరువాత 15 రోజుల పాటు సందర్శకుల కోసం తెరిచి ఉంచుతారు. ఆ తరువాత రాష్ట్రపతి భవనాన్ని మూసేస్తారు. అయితే, ఇకపై అలా కాకుండా సంవత్సరంలోని అన్ని రోజులూ సందర్శకుల కోసం రాష్ట్రపతి భవనాన్ని తెరిచే ఉంచాలని రాష్ట్రపతి భవన్ అధికారులు నిర్ణయించారు. ఈ నెల 23 నుండి రాష్ట్రపతి నిలయం సందర్శకుల కోసం తెరిచి ఉంచబోతున్నారు.
ఈనెల 23వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ నుండి వర్చువల్ మోడ్‌లో రాష్ట్రపతి నిలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై హాజరుకానున్నారు. 23వ తేదీ తరువాత ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రపతి భవన్ ఓపెన్ చేసి ఉంటుంది. రాష్ట్రపతి భవన్‌ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రాష్ట్రపతి భవన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సందర్శకుల తాకిడిని అనుసరించి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. వేసవి కాలం రాబోతున్న సందర్భంగా ఈ సరికొత్త పర్యాటకం ఆకట్టుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.