మే 30 నుంచి జూన్ 30 వరకు తెలంగాణలోని ప్రతి ఊరికి బీజేపీ వెళ్తుందని కె. లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణా అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కెసిఆర్ పంటనష్టపోతే స్పందించలేదని కె. లక్ష్మణ్ విమర్శించారు
BJP will win 303 seats in Loksabha elections, Says K. Laxman
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 303 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ధీ మా వ్యక్తం చేశారు. జాతీయస్థాయి, రాష్ట్రస్థాయిల్లో కార్యవర్గ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయని గుర్తుచేశారు. ధన్యవాద్ మోడీ పేరుతో ఓబీసీ సమ్మేళన సదస్సులు నిర్వహించాలని ఓబీసీ మోర్చా నిర్ణయం తీసుకుందని లక్ష్మణ్ వెల్లడించారు. ప్రపంచ దేశాలు మోడీ నాయకత్వాన్ని ఆరాధిస్తున్నాయని ఈ సందర్భంగా లక్ష్మణ్ గుర్తుచేసుకున్నారు.
మహా సంపర్క్ అభియాన్ పేరుతో ప్రధాని స్థాయి నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు నివేదిక రూపంలో ప్రజల ముందుకు రానున్నామని బీజేపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రాలవారీగా అభివృద్ధి నివేదికలు రూపొందించి ప్రజల ముందుకు వెళ్తున్నామని లక్ష్మణ్ తెలిపారు.
తెలంగాణలోని ప్రతి ఊరికి బీజేపీ – లక్ష్మణ్
మే 30 నుంచి జూన్ 30 వరకు తెలంగాణలోని ప్రతి ఊరికి బీజేపీ వెళ్తుందని కె. లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణా అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కెసిఆర్ పంటనష్టపోతే స్పందించలేదని కె. లక్ష్మణ్ విమర్శించారు. పంట నష్టం జరిగి రైతులు, కౌలు రైతులు ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని లక్ష్మణ్ దుయ్య బట్టారు. పది వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు.
కేసీఆర్‌ది 30 శాతం కమిషన్ సర్కార్ – కె. లక్ష్మణ్
కేంద్ర ప్రభుత్వ పథకం ఫసల్ భీమా కూడా తెలంగాణలో అమలు చేయకుండా రైతుల నోట్లో మన్నుకొట్టారని లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్‌ది 30 శాతం కమిషన్ సర్కారని కె. లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీయే ప్రత్యామ్నాయమని కె. లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ను ఓడించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే – లక్ష్మణ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కర్ణాటక ప్రమాణ స్వీకారానికి పిలవలేదని లక్ష్మణ్ విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మళ్లేలా కేసీఆర్ వ్యవహరించారుని లక్ష్మణ్ తనదైన శైలిలో వివరించారు. బీఆర్ఎస్తో కలిసే పరిస్థితి వస్తుందని స్వయంగా కాంగ్రెస్ నేతలు చెబుతున్న విషయాన్ని లక్ష్మణ్ గుర్తుచేశారు.
కవిత విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదు
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలోను లక్ష్మణ్ స్పందించారు. కల్వకుంట్ల కవితను దర్యాప్తు సంస్థలే అరెస్టు చేస్తాయని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. పార్టీలో కొత్తవారు రావడం నిరంతర ప్రక్రియ అని లక్ష్మణ్ అన్నారు,. కేవలం చేరికలపైనే బీజేపీ ఆధారపడిలేదని స్పష్టం చేశారు.
మోడీపై ఆక్రోశంతో ప్రారంభ వేడుకలకు దూరం
మోడీ మీద ఉన్న ఆక్రోశంతోనే విపక్షాలు పార్లమెంట్ భవన ప్రారంభ వేడుకలను బాయికాట్ చేస్తున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. గతంలో ప్రధాని హోదాలోనే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్ ప్రారంబోత్సవాలు చేసిన సందర్భాలున్నాయని లక్ష్మణ్ గుర్తుచేశారు.