BJP National Executive Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం… తెలంగాణపై ప్రత్యేక దృష్టి
BJP National Executive Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జనవరి 16,17 తేదీల్లో జరగనున్నది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీఎల్ సంతోష్‌లు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో వీరితో పాటు ఇతర బీజేపీ ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు. సుమారు 300 మందికి పైగా నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జీ20 సన్నాహక సమావేశాల ఏర్పాటుపై చర్చించనున్నారు. మార్చినెలలో విశాఖలో ఏర్పాటు చేయనున్న జీ 20 సన్నాహక సమావేశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉన్నది, ఎలా పార్టీని అక్కడ క్షత్రస్థాయిలో బలపడేలా చేయాలంటే ఎలాంటి వ్యూహాలు రచించాలనే వాటిపై కూడా నేతలు చర్చించనున్నారు. ఇక ఈ ఏడాది కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ విజయావకాశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాదే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.