రామగుండంలో పర్యటనపై ప్రస్తుతం జరుగుతున్న వ్యతిరేక కార్యక్రమాలను లక్ష్మణ్ ఖండించారు. బిజెపిని, ప్రధాని మోడీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6000 కోట్ల పైచిలుకు నిధులతో పునరుద్ధరించారని, దాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని వస్తుంటే అడ్డుకుంటామని అంటున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేంద్ర నిధులు సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారని గుర్తుచేశారు. ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని, తెలంగాణలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారని తెలిపారు.
రామగుండంలో పర్యటనపై ప్రస్తుతం జరుగుతున్న వ్యతిరేక కార్యక్రమాలను లక్ష్మణ్ ఖండించారు. బిజెపిని, ప్రధాని మోడీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6000 కోట్ల పైచిలుకు నిధులతో పునరుద్ధరించారని, దాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని వస్తుంటే అడ్డుకుంటామని అంటున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కర్మాగారం ఓపెన్ చేస్తుంటే కేసీఆర్‌కి వచ్చిన కడుపు మంట ఏంటని ప్రశ్నించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు కేసీఆర్ నిలబెట్టుకోవడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశలను కేసీఆర్ అడ్డుకుంటున్నారని, తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి పనులను ఎదుర్కొనే సామర్థ్యం బిజెపికే ఉందని, అందుకే మునుగోడులో 40% ఓట్లు బిజెపికి వేశారని లక్ష్మణ్ తెలిపారు. ప్రస్తుతం లెఫ్ట్ పార్టీలో నేతలు కేసీఆర్ కనుసన్నల్లో ఉన్నారని విమర్శించారు. కమ్యూనిస్టులకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కేసీఆర్ దొరికారని, ప్రజలు వీటన్నిటిని అర్థం చేసుకుంటున్నారని లక్ష్మణ్ అన్నారు.
తెలంగాణలో రైతు సమస్యలపై కూడా లక్ష్మణ్ పలు విమర్శలు గుప్పించారు. దేశంలోనే రైతులు ఆత్మహత్య చేసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉందని, రైతులు సబ్సిడీ ఇవ్వాలని కోరుతుంటే తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసి చోద్యం చూస్తోందని విమర్శించారు. ఫసల్ బీమా పథకం తెలంగాణలో అమలు కావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తామని కేసీఆర్ చెప్పిన మాట ఏమైందని లక్ష్మణ్ ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అభాసు పాలయిందని, 30 వేల కోట్ల ప్రాజెక్టును 1,20,000 కోట్లకు పెంచారని లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ రైతుల నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని, మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయగా మారిందని ఆరోపించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దానికి కారణం ప్రభుత్వమేనని విమర్శించారు. మూడేళ్ల నుంచి తెలంగాణలో నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఇంటికో ఉద్యోగం అని చెప్పిన టిఆర్ఎస్ ఇప్పుడు ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. సింగరేణిని లాభాల బాటలు నడిపిస్తుంటే వారికి న్యాయపరమైన డిమాండ్ నెరవేర్చకుండా బోనస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని, హింసను పేరేపించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీటిలో కమ్యూనిస్టులు చలి కాల్చుకునే ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.