PM Modi Visit: హైదరాబాద్ కు మోడీ.. బీజేపీ నేతలు ఇన్ యాక్షన్!
BJP Leaders Planning for PM Modi Secundrabad Visit: హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. జనవరి 19వ తేదీన ఆయన హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా విజయవాడ -హైదరాబాద్ మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ప్రెస్ ని ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రారంభించబోతున్నారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కేవలం నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోనుంది.
ఇక అదే రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికగా ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 2100 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. 700 కోట్ల రూపాయలతో ఇప్పటికే రైల్వే స్టేషన్ ను సుందరంగా ఆధునీకరించనున్నారు, మరోపక్క 1231 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ మహబూబ్నగర్ డబ్లింగ్ పనులు ప్రారంభించనున్నారు.
అదే విధంగా 521 కోట్లతో కాజీపేట రైల్వే కోచ్ వర్క్ షాప్ పనులను కూడా ఆయన ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ కార్యక్రమాల నిర్వహణ విషయం మీద ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ దక్షిణ మధ్య రైల్వే అధికారులతో భేటీ అయ్యారు. ప్రధాని రాక సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందర్శన, తదితర ఏర్పాట్లపై చర్చలు జరిపారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు ప్రారంభించిన తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ను కూడా మోడీ సందర్శించబోతున్నారు.