TSPSC: పేపర్ల లీకేజీ వ్యవహారంపై బీజేపీ పోరాటం, గవర్నర్ కు ఫిర్యాదు
BJP leaders complaint to Governor on KCR government
తెలంగాణ బీజేపీ నాయకులు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను కలిసి పోటీ పరీక్షల పేపర్లు లేకేజీ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. గవర్నర్ ముందు కొన్ని డిమాండ్లను ఉంచారు. పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. TSPSC చైర్మన్ సభ్యులను డిబార్ చేసి కొత్త కమిషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
TSPSCలో ఉద్యోగాలు చేస్తున్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి పోటీ పరీక్షల పేపర్లు లీక్ చేశారు. రేణుక ద్వారా లక్షల్లో వాటిని అమ్ముకున్నారు. సొమ్ము చేసుకున్నారు. వీరి అక్రమాలు వెలుగు చూడడంతో ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధిలోకం నివ్వెరపోయింది. విద్యార్ధి సంఘాలు TSPSC కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు.