రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కాక రేపుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును తేల్చి చెప్పడంతోపాటు బండి సంజయ్ నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వంలో అనేక లోపాలు ఉన్నాయని రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఇన్చార్జులలో సరైన వ్యక్తి ఒక్కరున్నా చాలని రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా అధినాయకత్వంపై విమర్శలు గుప్పించారు.
BJP leader Rajgopal reddy expresses displeasure on BJP Leadership
తెలంగాణ బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణలో విజయావకాశాలపై ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ మనసులోని మాటను బయటపెట్టారు. సీఎం కేసీఆర్ ముందు బీజేపీ వ్యూహాలు ఎందుకూ పనికిరావని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీకి చెందిన నేతే బీజేపీ తీరుపై అంసతృప్తి వ్యక్తం చేయడం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలు కేసీఆర్ సీఎంగా ఉన్న తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపబోవని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కాక రేపుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును తేల్చి చెప్పడంతోపాటు బండి సంజయ్ నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వంలో అనేక లోపాలు ఉన్నాయని రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఇన్చార్జులలో సరైన వ్యక్తి ఒక్కరున్నా చాలని రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా అధినాయకత్వంపై విమర్శలు గుప్పించారు.
మునుగోడు ఉప ఎన్నికలు ముగిసి 6 నెలలు గడిచిపోయాయని, తనకు ఇప్పటి వరకు సరైన బాధ్యతలు అప్పగించలేదని రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సేవలను పూర్తిగా వినియోగించుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి తన బాధను వెళ్లగక్కారు.
బీజేపీ నేతల మండిపాటు
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్లు భగ్గుమంటున్నారు. పార్టీలో చేరిన ఆరు నెలల్లోనే పదవులు ఆశిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత పార్టీ కోసం కోమటిరెడ్డి ఏం చేశారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తుననారు. పార్టీ వ్యవహారాలతో సంబంధం లేనట్లుగా ఉంటున్న రాజగోపాల్ రెడ్డి, పార్టీ నుంచి వెళ్లి పోవాలంటే వెళ్లిపోవచ్చని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.